Share News

విజయవంతంగా దీర్ఘ శ్రేణి క్షిపణి ప్రయోగం

ABN , Publish Date - Nov 13 , 2024 | 05:53 AM

డీఆర్‌డీవో మంగళవారం విజయవంతంగా దీర్ఘ శ్రేణి క్షిపణి- లాంగ్‌ రేంజ్‌ ల్యాండ్‌ అటాక్‌ క్రూయజ్‌ మిస్సైల్‌ (ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం)ను ప్రయోగించినట్టు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒడిశాలోని చండీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌లో

విజయవంతంగా దీర్ఘ శ్రేణి క్షిపణి ప్రయోగం

న్యూఢిల్లీ, నవంబరు 12: డీఆర్‌డీవో మంగళవారం విజయవంతంగా దీర్ఘ శ్రేణి క్షిపణి- లాంగ్‌ రేంజ్‌ ల్యాండ్‌ అటాక్‌ క్రూయజ్‌ మిస్సైల్‌ (ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం)ను ప్రయోగించినట్టు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒడిశాలోని చండీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌లో సంచార ఆర్టిక్యులేటెడ్‌ లాంఛర్‌ ద్వారా ప్రయోగించినట్టు పేర్కొంది. ఈ తరహా క్షిపణిని ప్రయోగించడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. సుదూరంలో నేలపైన ఉన్న లక్ష్యాలను గురిపెట్టి దీన్ని ప్రయోగిస్తారు. దీన్ని లాంఛర్‌ సాయంతో భూమిపై నుంచి, యుద్ధ నౌకల ద్వారా సముద్రంపై నుంచి కూడా ప్రయోగించే వెసులుబాటు ఉంది. దీని నిర్మాణంలో బెంగళూరులోని ఎరోనాటికల్‌ డెవల్‌పమెంట్‌ ఎక్వి్‌పమెంట్‌ సంస్థ, భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ సంస్థ, హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ సంస్థలు పాలు పంచుకున్నాయి.

Updated Date - Nov 13 , 2024 | 05:53 AM