Share News

విరాళాలకు, ఈడీ దాడులకు సంబంధమే లేదు

ABN , Publish Date - Mar 16 , 2024 | 05:04 AM

అధికార పార్టీకి అందే ఎన్నికల విరాళాలకు, కేంద్ర దర్యాప్తు సంస్థలు చేసే దాడులకూ ఎలాంటి సంబంధం ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఇలాంటి ఆరోపణలు కేవలం ఊహాగానాలేనని చెప్పారు. ‘‘ఈడీ వెళ్లి కంపెనీలపై దాడులు చేస్తే,

విరాళాలకు, ఈడీ దాడులకు సంబంధమే లేదు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ, మార్చి 15: అధికార పార్టీకి అందే ఎన్నికల విరాళాలకు, కేంద్ర దర్యాప్తు సంస్థలు చేసే దాడులకూ ఎలాంటి సంబంధం ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఇలాంటి ఆరోపణలు కేవలం ఊహాగానాలేనని చెప్పారు. ‘‘ఈడీ వెళ్లి కంపెనీలపై దాడులు చేస్తే, ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాయనుకోవడం పూర్తిగా ఊహాగానమే. ఎన్నికల బాండ్లు కొన్న తర్వాత కూడా ఈడీ దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి కదా! మరి దాన్నేమంటారు?’’ అని ఆమె ప్రశ్నించారు. ఇక ఎలక్టోరల్‌ బాండ్లన్నీ అధికార బీజేపీకే వచ్చాయని చాలా మంది ప్రచారం చేస్తున్నారని.. అది కూడా తప్పని చెప్పారు. కంపెనీలు ప్రాంతీయ పార్టీలకు కూడా విరాళాలు ఇస్తాయని గుర్తుచేశారు. రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే ఎలక్టోరల్‌ బాండ్ల విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడ్డారు. గతంలో కంటే ఇది మెరుగైన విధానమేనని పేర్కొన్నారు. గత వ్యవస్థలోనూ లోపాలు ఉన్నాయి కదా? అని నిర్మల ప్రశ్నించారు. గతంలో కంటే మెరుగైనదిగా భావించే మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు.

Updated Date - Mar 16 , 2024 | 06:41 AM