Share News

Delhi: ఢిల్లీ మహిళా కమిషన్‌లోని 223 మంది తొలగింపు

ABN , Publish Date - May 03 , 2024 | 03:19 AM

ఢిల్లీ మహిళా కమిషన్‌లో పనిచేస్తున్న 223 మంది కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపునకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా ఆమోదం తెలిపారు.

Delhi: ఢిల్లీ మహిళా కమిషన్‌లోని 223 మంది తొలగింపు

  • అందరూ కాంట్రాక్టు ఉద్యోగులే

  • లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదం

  • భర్తీ ప్రక్రియ అక్రమం అని వెల్లడి

  • ఢిల్లీ మహిళా కమిషన్‌లోని

  • లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదం

న్యూఢిల్లీ, మే2: ఢిల్లీ మహిళా కమిషన్‌లో పనిచేస్తున్న 223 మంది కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపునకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా ఆమోదం తెలిపారు. వారి నియామకాలు అక్రమం, చట్టవ్యతిరేకమని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు.


గతంలో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేసిన స్వాతి మలివాల్‌ ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ఉద్యోగులను నియమించారని దర్యాప్తులో తేలడంతో వారిని తొలగిస్తున్నట్టు మహిళా, శిశు సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్‌ పేర్కొన్నారు.మహిళా కమిషన్‌కు కేవలం 40 పోస్టులు మాత్రమే కేటాయించగా ఆమె మాత్రం లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోకుండానే ఇంతమందిని నియమించారని తెలిపారు.

Updated Date - May 03 , 2024 | 06:52 AM