ఇద్దరు బెంగాల్ ఐపీఎ్‌సలపై క్రమశిక్షణ చర్యలు
ABN , Publish Date - Jul 08 , 2024 | 05:01 AM
రాజ్‌భవన్ పరువు తీశారన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులపై కేంద్ర హోం శాఖ క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్, డీసీపీ ఇందిరా ముఖర్జీలపై చర్యలు ప్రారంభించినట్టు తెలిపింది.

కోల్‌కతా, జూలై 7: రాజ్‌భవన్ పరువు తీశారన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులపై కేంద్ర హోం శాఖ క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్, డీసీపీ ఇందిరా ముఖర్జీలపై చర్యలు ప్రారంభించినట్టు తెలిపింది. వారిద్దరు రాజ్‌భవన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ గవర్నర్ సివి.ఆనంద్ బోస్ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయడంతో పాటు, వారి పనితీరుపై నివేదిక పంపించారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో బాఽధితులైనవారు తనను కలిసేందుకు రాగా ఆ అధికారులు వారిని రానీయలేదని గవర్నర్ తెలిపారు. తనపై ఓ మహిళా ఉద్యోగి కల్పిత ఆరోపణలు చేయగా మరికొందరు పోలీసు అధికారులు వాటిని ప్రచారంలోకి తెచ్చారని తెలిపారు. గవర్నర్ కార్యాలయ ప్రతిష్ఠకు నష్టం కలిగించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను వద్దని చెప్పినప్పటికీ రాజ్‌భవన్ ఉద్యోగులను తనిఖీ చేస్తున్నారని, గుర్తింపు కార్డులు చూపాలని అడుగుతున్నారని తెలిపారు.