Share News

Devyani Khobrogade: కొత్త సంవత్సర వేడుకలు.. అప్సరగా దేవయాని

ABN , Publish Date - Apr 14 , 2024 | 02:11 PM

కంబోడియాలో కేమర్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలాంటి వేళ కంబోడియాలోని భారత రాయబారి దేవయాని ఖోబ్రోగడే.. అప్పరగా దిగిన ఫోటోలను రాయబారి కార్యాలయం ఎక్స వేదికగా పోస్ట్ చేసింది.

Devyani Khobrogade: కొత్త సంవత్సర వేడుకలు.. అప్సరగా దేవయాని

నాంఫెన్, ఏప్రిల్ 14: కంబోడియాలో కేమర్ నూతన సంవత్సర (Khmer New Year) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలాంటి వేళ కంబోడియా(Cambodia)లోని భారత రాయబారి దేవయాని ఖోబ్రోగడే.. (Devyani Khobragade)అప్పరగా దిగిన ఫోటోలను రాయబారి కార్యాలయం ఎక్స వేదికగా పోస్ట్ చేసింది.

అలాగే కంబోడియా ప్రజలకు కేమర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేమర్ సంస్కృతి, సంప్రదాయల పట్ల ఆమెకు చాలా మక్కువ ఉందని తెలిపింది. అందులోభాగంగానే కేమర్ అప్సర దుస్తులు ధరించారని చెప్పింది. ఇక్కడి నాగరికతతో ఆమెకు బంధం బలపడిందంది. కంబోడియా స్నేహితులకు ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.

Former CM: మమ్మల్ని విచ్ఛిన్నం చేయాలనుకొనేవారు గాల్లో కొట్టుకుపోతారు..

అలాగే ఈ నూతన సంవత్సర వేడుకలు కంబోడియా ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించింది. కంబోడియా సంప్రదాయనికి తగ్గట్లు ఆమె దస్తులు ధరించారు. దేవయాని ఫోటోల్లో బంగారు అభరణాలతోపాటు.. తలకు కిరిటాన్ని సైతం ధరించారు.

కంబోడియాలో ప్రతి ఏడాది మూడు రోజులు పాటు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతాయి. వాటిని కేమర్ నూతన సంవత్సర వేడుకలని పిలుస్తారు. దీనిని చౌల్ చనమ్ తీమే అని పిలుస్తారు. అంటే నూతన సంవత్సరం ప్రవేశిస్తుందని అర్థం. కంబోడియాలో పంట సాగు కాలం పూరి అయిన తర్వాత వర్షకాలం ప్రవేశిస్తున్న వేళ.. ఈ వేడుకలను జరుపుకుంటారు.

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే..

1999 ఇండియా ఫారెన్ సర్వీస్ అధికారి దేవయాని ఖోబ్రోగడే. గతంలో బెర్లిన్, ఇస్తామాబాద్, రోమ్, న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయాల్లో విధులు నిర్వహించారు. న్యూఢిల్లీలోని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పలు కీలక విభాగాల్లో సైతం ఆమె ఉన్నతాధికారగా పని చేశారు. ప్రస్తుతం దేవయాని కంబోడియాలో భారత రాయబారిగా ఉన్నారు.

https://twitter.com/indembcam

Updated Date - Apr 14 , 2024 | 03:08 PM