కూల్చివేతల బాధితులు కోర్టుకెళ్లొచ్చు: సుప్రీం
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:32 AM
ఆస్తుల కూల్చివేతల కారణంగా నష్టపోయిన బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని గురువారం సుప్రీంకోర్టు తెలిపింది. న్యాయస్థానం ఆదేశాలను కాదని ఆస్తులను

న్యూఢిల్లీ, అక్టోబరు 24: ఆస్తుల కూల్చివేతల కారణంగా నష్టపోయిన బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని గురువారం సుప్రీంకోర్టు తెలిపింది. న్యాయస్థానం ఆదేశాలను కాదని ఆస్తులను కూల్చివేసిన రాష్ట్ర ప్రభుత్వాలపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడానికి మాత్రం నిరాకరించింది. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా ఇళ్లను కూల్చివేయొద్దన్న ఆదేశాలను ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ ప్రభుత్వాలు పాటించలేదని, వాటిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ పి.కె.మిశ్ర, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌ల ధర్మాసనం పరిశీలించింది. బాఽధితులు కాకుండా వేరే వ్యక్తి ఈ పిటిషన్ వేయడంతో స్వీకరించడానికి నిరాకరించింది. బాధితులు స్వయంగా కోర్టుకు రావచ్చని, ధర్మాసనాలు వాటిపై విచారణ జరుపుతాయని పేర్కొంది.