విడాకులు తీసుకున్నా తండ్రి హోదా చెరిగిపోదు
ABN , Publish Date - Feb 06 , 2024 | 03:50 AM
భార్యాభర్తలు విడాకులు తీసుకున్నప్పటికీ తల్లిదండ్రులుగా వారి హోదా చెరిగిపోదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పాఠశాలల్లోని పిల్లల రికార్డుల్లో వారి పేర్లను కొనసాగించవ్చని తెలిపింది. మైనర్‌గా ఉన్న
స్కూలు రికార్డుల్లో పేరు కొనసాగించాలి
ఢిల్లీ హైకోర్టు తీర్పు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: భార్యాభర్తలు విడాకులు తీసుకున్నప్పటికీ తల్లిదండ్రులుగా వారి హోదా చెరిగిపోదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పాఠశాలల్లోని పిల్లల రికార్డుల్లో వారి పేర్లను కొనసాగించవ్చని తెలిపింది. మైనర్‌గా ఉన్న తన కుమారుని రికార్డుల్లో తండ్రి అన్న చోట తన పేరును కొనసాగించాలంటూ ఓ తండ్రి చేసిన వినతిని అంగీకరించింది. ఓ జంటకు 2006 మార్చిలో కుమారుడు జన్మించాడు. పాఠశాలల్లో తండ్రిగా అతని పేరునే నమోదు చేశారు. 2105లో భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఆమె మరో వివాహం చేసుకుంది. 2016 తరువాత తండ్రి అన్న కాలంలో రెండో భర్త పేరును రాయడం ప్రారంభించారు. తాను జీవించి ఉండగా మరొకరి పేరును తండ్రిగా రాయడమేమిటని ప్రశ్నిస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు. జన్మనిచ్చిన తండ్రిగా తన పేరునే రికార్డుల్లో రాయాలని, రెండు వారాల్లో ఆయన పేరుతో రికార్డులు మార్చాలంటూ సంబంధిత పాఠశాలను న్యాయమూర్తి ఆదేశించారు.