అతిషి సామగ్రి బయటపడేసి సీఎం నివాసాన్ని ఖాళీ చేయించి..
ABN , Publish Date - Oct 10 , 2024 | 06:02 AM
ఢిల్లీ సీఎం అతిషి తన అధికార నివాసంలోకి అడుగుపెట్టిన రెండురోజులకే చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఢిల్లీ ఎల్జీ వినయ్ సక్సేనా ఆదేశాల మేరకు అధికారులు అతిషి అధికార నివాసంలోని వస్తువులన్నింటినీ బయటపడేశారు. ‘దేశంలో తొలిసారిగా
ఢిల్లీ సీఎం అతిషి తన అధికార నివాసంలోకి అడుగుపెట్టిన రెండురోజులకే చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఢిల్లీ ఎల్జీ వినయ్ సక్సేనా ఆదేశాల మేరకు అధికారులు అతిషి అధికార నివాసంలోని వస్తువులన్నింటినీ బయటపడేశారు. ‘దేశంలో తొలిసారిగా ఒక సీఎంను అధికార నివాసం నుంచి బలవంతంగా ఖాళీ చేయించారు. బీజేపీ నేతల ఆదేశాల మేరకే ఎల్జీ ఈ చర్యకు పాల్పడ్డారు’ అని సీఎం కార్యాలయం పేర్కొంది. కేజ్రీవాల్ తాను సీఎంగా ఉన్న కాలంలో ఉత్తర ఢిల్లీ సివిల్ లైన్స్ ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులోని ఆరో నంబర్ అధికార గృహంలో నివసించారు. ఆయన రాజీనామా తర్వాత సీఎం అయిన అతిషి రెండురోజుల క్రితమే అధికార గృహంలోకి మారారు. అయితే కేజ్రీవాల్ ఆ ఇంటిని ఖాళీ చేస్తున్నట్లు అధికారికంగా చెప్పలేదని, అందులో అతిషి ఉండటం నిబంధనలను అతిక్రమించడమేని అధికారులు తెలిపారు.