Share News

కశ్మీర్‌లో 8కి పెరిగిన ఎన్‌కౌంటర్ల మృతుల సంఖ్య

ABN , Publish Date - Jul 08 , 2024 | 05:05 AM

కుల్‌గాం జిల్లాలో శనివారం జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది. మోడెర్‌గాంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక జవాను; చిన్నిగాంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక జవాను, నలుగురు ఉగ్రవాదులు మరణించారని, మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని

కశ్మీర్‌లో 8కి పెరిగిన ఎన్‌కౌంటర్ల మృతుల సంఖ్య

న్యూఢిల్లీ, జూలై 7: కుల్‌గాం జిల్లాలో శనివారం జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది. మోడెర్‌గాంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక జవాను; చిన్నిగాంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక జవాను, నలుగురు ఉగ్రవాదులు మరణించారని, మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని తొలుత అధికారులు ప్రకటించారు. అయితే ఆదివారం మోడెర్‌గాంలో మరో ఇద్దరు ఉగ్రవాదుల శవాలు దొరకడంతో మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ప్రాణాలు కోల్పోయిన జవాన్లలో సుశిక్షితుడైన ఒక పారా కమాండో కూడా ఉన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 05:05 AM