Share News

జేఎన్‌యూకు 30 ఏళ్ల తర్వాత దళిత ప్రెసిడెంట్‌

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:04 AM

ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ దళితుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

జేఎన్‌యూకు 30 ఏళ్ల తర్వాత దళిత ప్రెసిడెంట్‌

విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ధనంజయ్‌

న్యూఢిల్లీ, మార్చి 25: ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ దళితుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఏఐఎ్‌సఏ) తరఫున పోటీ చేసిన ధనంజయ్‌ తన సమీప ప్రత్యర్థి అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ)కు చెందిన ఉమేశ్‌ సి అజ్మీరాపై 922 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఽ1996-97లో లెఫ్ట్‌ కూటమికి చెందిన బట్టీలాల్‌ బైర్వా తర్వాత ఓ దళితుడు జేఎన్‌యూ విద్యార్థి సంఘానికి ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం ఇదే తొలిసారి. అలాగే జేఎన్‌యూ విద్యార్థి సంఘం వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎస్‌ఎ్‌ఫఐకి చెందిన అవిజిత్‌ ఘోష్‌ గెలుపొందగా, జనరల్‌ సెక్రటరీగా బిర్సా అంబేడ్కర్‌ ఫూలే స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (బాప్సా)కు చెందిన ప్రియాంషీ ఆర్యా ఎన్నికయ్యారు. జాయింట్‌ సెక్రటరీగా లెఫ్ట్‌ కూటమికి చెందిన మహమ్మద్‌ సాజిద్‌ గెలుపొందారు. నాలుగేళ్ల విరామం తర్వాత జేఎన్‌యూలో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో వామపక్ష కూటమికి చెందిన అభ్యర్థులు క్లీన్‌ స్వీప్‌ చేశారు.

Updated Date - Mar 26 , 2024 | 08:14 AM