కొత్త మంత్రుల్లో 28మందిపై క్రిమినల్ కేసులు
ABN , Publish Date - Jun 12 , 2024 | 04:14 AM
నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలోని 28 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీళ్లలో 19 మందిపై హత్యాయత్నం, విద్వేష ప్రసంగం, మహిళలపై నేరాలు వంటి

న్యూఢిల్లీ, జూన్ 11 : నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలోని 28 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీళ్లలో 19 మందిపై హత్యాయత్నం, విద్వేష ప్రసంగం, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఆయా ఎంపీలు తమ ఎన్నికల నామినేషన్లు దాఖలు సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లను అధ్యయనం చేసిన అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఈ మేరకు ఓ నివేదిక ఇచ్చింది. ముఖ్యంగా పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖల సహాయ మంత్రి శంతనూ ఠాకూర్, విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుఖాంత మజుందార్‌పై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. అలాగే, శంతనూ ఠాకూర్, మజుందార్, బండి సంజయ్. సురేష్ గోపీ సహా ఐదుగురు సహాయ మంత్రులపై మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు ఉన్నాయి. ఇక, 71 మంది మంత్రుల్లో 70 మంది అనగా 99 శాతం మంది కోటీశ్వరులని, మంత్రుల సగటు ఆస్తి రూ.108 కోట్లని ఏడీఆర్ పేర్కొంది.