Share News

హమాస్‌కు ఐరాస ఏజెన్సీ సిబ్బంది సహకారం

ABN , Publish Date - Jan 28 , 2024 | 01:27 AM

ఇజ్రాయెల్‌పై హమాస్‌ అక్టోబరు 7న జరిపిన దాడిలో ఐరాస అనుబంధ ఏజెన్సీ సభ్యులు ప్రత్యక్ష్యంగా పాల్గొన్నారు. దాడిలో పాల్గొన్న యునైటెడ్‌ నేషన్స్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఏజెన్సీ ఫర్‌ పాలస్తీనా రిఫ్యూజీస్‌

హమాస్‌కు ఐరాస ఏజెన్సీ సిబ్బంది సహకారం

జెరూసలేం, జనవరి 27: ఇజ్రాయెల్‌పై హమాస్‌ అక్టోబరు 7న జరిపిన దాడిలో ఐరాస అనుబంధ ఏజెన్సీ సభ్యులు ప్రత్యక్ష్యంగా పాల్గొన్నారు. దాడిలో పాల్గొన్న యునైటెడ్‌ నేషన్స్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఏజెన్సీ ఫర్‌ పాలస్తీనా రిఫ్యూజీస్‌ ఇన్‌ ద నియర్‌ ఈస్ట్‌(యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ)కు చెందిన 12 మంది సిబ్బంది వివరాలను గత నెలలోనే ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఐరాసకు అందజేసింది. శుక్రవారం యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ఈ విషయాన్ని నిర్ధారించింది. 12 మంది సిబ్బందిని తొలగించామని, వారిపై ప్రాసిక్యూషన్‌ చేపడతామని ప్రకటించింది. మరోవైపు, ఐరాస సెక్రటరీ జనరల్‌ గుటెర్రస్‌ దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. హమా్‌సకు యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ సిబ్బంది సహకరించిన విషయం నిర్ధారణ అవ్వగానే.. పలు దేశాలు ఆ సంస్థకు నిధులను తాత్కాలికంగా నిలిపివేస్తామని ప్రకటించాయి. కాగా.. 1951 నుంచి పాలస్తీనాలో యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ సేవలను అందిస్తోంది.

Updated Date - Jan 28 , 2024 | 07:49 AM