Share News

సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పులకు అమెరికాలో కుట్ర

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:31 AM

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి ఆవరణలో కాల్పులకు అమెరికాలో పథకం రచించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ కుడి భుజంగా భావించే రోహిత్‌ గోదారా..

సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పులకు అమెరికాలో కుట్ర

ముంబై, ఏప్రిల్‌ 15: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి ఆవరణలో కాల్పులకు అమెరికాలో పథకం రచించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ కుడి భుజంగా భావించే రోహిత్‌ గోదారా.. బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ కోరిక మేరకు ఇద్దరు వ్యక్తులతో కాల్పులు జరిపించినట్లు పోలీసులు చెప్పారు. సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పులు జరిపిన వ్యక్తుల కదలికలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. నిందితుల్లో ఒకరిని విశాల్‌గా గుర్తించిన పోలీసులు.. అతడు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. కాల్పుల ఘటనలో దుండగులు ఉపయోగించిన బైక్‌ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. బైక్‌ను కొద్దిరోజుల క్రితమే వేరేవ్యక్తికి అమ్మినట్లు అతడు చెప్పాడు.

Updated Date - Apr 16 , 2024 | 06:46 AM