Share News

300 కంటే తక్కువ స్థానాల్లోనే కాంగ్రెస్‌ పోటీ!

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:51 AM

దేశంలో అతి పురాతన పార్టీ కాంగ్రెస్‌ ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 300 స్థానాల్లోపే పోటీచేస్తోంది. సభలో మొత్తం 543 సీట్లు ఉండగా.. మిత్రపక్షాలతో సర్దుబాటు

300 కంటే తక్కువ స్థానాల్లోనే కాంగ్రెస్‌ పోటీ!

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16: దేశంలో అతి పురాతన పార్టీ కాంగ్రెస్‌ ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 300 స్థానాల్లోపే పోటీచేస్తోంది. సభలో మొత్తం 543 సీట్లు ఉండగా.. మిత్రపక్షాలతో సర్దుబాటు కారణంగా తక్కువ సీట్లకే పోటీచేయాల్సి వస్తోంది. స్వాతంత్ర్యానంతరం ఇన్ని తక్కువ స్థానాల్లో పోటీచేయడం ఇదే మొదటిసారి. 2004లో పొత్తుల కారణంగా అతితక్కువగా 417 స్థానాల్లో బరిలోకి దిగింది. ఇప్పుడు కేవలం 300 స్థానాల్లోపే పోటీ చేస్తోంది. ఇప్పటిదాకా 27 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 278 మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఏపీ, హరియాణా, బిహార్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, యూపీ, బెంగాల్‌ రాష్ట్రాల్లో మరో 20 స్థానాలకు పేర్లు ఖరారు చేయాల్సి ఉంది.

Updated Date - Apr 17 , 2024 | 02:51 AM