Share News

కమిషనర్ల నియామకంపై కమిటీ భేటీ ఒక రోజు ముందే!

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:06 AM

ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న ఇద్దరు కమిషనర్ల నియామకంపై ప్రధాని మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశం ఒక రోజు ముందుకు జరిగింది.

కమిషనర్ల నియామకంపై కమిటీ భేటీ ఒక రోజు ముందే!

న్యూఢిల్లీ, మార్చి 11: ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న ఇద్దరు కమిషనర్ల నియామకంపై ప్రధాని మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశం ఒక రోజు ముందుకు జరిగింది. తొలుత 15న సాయంత్రం 6 గంటలకు కమిటీ భేటీ ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు దానిని గురువారం (ఈ నెల 14న) నిర్వహించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని, కేంద్ర మంత్రి, లోక్‌ సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ సమావేశమై.. ఎన్నికల కమిషనర్ల నియామకంపై రాష్ట్రపతికి పేర్లను సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. తరువాతి కొద్దిసేపటికి రాష్ట్రపతి నిర్ణయం వెలువడనుందని చెబుతున్నారు. లేదంటే మరుసటి రోజు జరిగే వీలుందని పేర్కొంటున్నారు. సమావేశం మార్పుపై కమిటీలోని సభ్యులకు కేంద్ర న్యాయ మంత్రిత్వ సమాచారం చేరవేసింది. కాగా, గత శనివారం ఒక ఈసీ నియామకానికి సంబంధించి భేటీపై కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో శుక్రవారం కమిషనర్‌ గోయల్‌ రాజీనామా చేశారు. ఇప్పుడు ఇద్దరు కమిషనర్లను ఒకేసారి నియమించనున్నారు.

Updated Date - Mar 12 , 2024 | 08:08 AM