మా కుమారుడి వివాహానికి రండి
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:04 AM
ఈ నెల 12న జరిగే తన చిన్న కుమారుడి పెళ్లికి రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆహ్వానించారు.

సోనియా గాంధీని ఆహ్వానించిన ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ, జూలై 4: ఈ నెల 12న జరిగే తన చిన్న కుమారుడి పెళ్లికి రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని టెన్ జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం పెళ్లి శుభలేఖను అందజేశారు. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడికి, రాధికా మర్చెంట్‌కు ముంబైలోని బాంద్రా జియో వరల్డ్ కన్వెక్షన్ సెంటర్‌లో వివాహం జరగనుంది.