Share News

ముంబై ఎయిర్‌పోర్టులో రూ.19.79 కోట్ల కొకైన్‌!

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:05 AM

ముంబై ఎయిర్‌పోర్టులో నిషేధిత మత్తు పదార్థం కొకైన్‌తో దిగిందో విదేశీ మహిళ! ఆమె వద్ద రూ.19.79 కోట్ల విలువైన 1979 గ్రాముల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ముంబై ఎయిర్‌పోర్టులో రూ.19.79 కోట్ల కొకైన్‌!

విదేశీ మహిళ నుంచి స్వాధీనం

న్యూఢిల్లీ, మార్చి 25: ముంబై ఎయిర్‌పోర్టులో నిషేధిత మత్తు పదార్థం కొకైన్‌తో దిగిందో విదేశీ మహిళ! ఆమె వద్ద రూ.19.79 కోట్ల విలువైన 1979 గ్రాముల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు పశ్చిమ ఆఫ్రికాలోని సియెర్రా లియోన్‌ దేశస్తురాలని.. కెన్యా రాజధాని నైరోబీ నుంచి ముంబైలో దిగిందని నిర్ధారించారు. ఆమె లగేజీలోని షూ, మాయ్చరైజర్‌ బాటిల్‌, షాంపూ బాటిళ్లు బరువుగా ఉండటంతో అనుమానించి తనిఖీ చేయగా పొట్లాల రూపంలో భారీగా కొకైన్‌ బయటపడినట్లు వెల్లడించారు. ఆమెను అరెస్టు చేశారు.

Updated Date - Mar 26 , 2024 | 08:10 AM