ప్యాంగాంగ్ సరసు వద్ద చైనా బ్రిడ్జి పూర్తి
ABN , Publish Date - Jul 31 , 2024 | 06:04 AM
భారత సరిహద్దులోని ప్యాంగాంగ్ సరస్సు వద్ద చైనా సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది! ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డులను కలిపే వంతెనను పూర్తిచేసిన చైనా
న్యూఢిల్లీ, జూలై 30: భారత సరిహద్దులోని ప్యాంగాంగ్ సరస్సు వద్ద చైనా సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది! ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డులను కలిపే వంతెనను పూర్తిచేసిన చైనా దాన్ని వినియోగంలోకి కూడా తీసుకొచ్చింది. సరిహద్దులో బలగాలను, సామగ్రిని త్వరగా తరలించడానికి అనువైన ఈ వంతెనతోపాటు దానికి అనుబంధంగా ఉన్న రోడ్లు కూడా వాడుకలో ఉన్నాయని అమెరికాకు చెందిన బ్లాక్ స్కై అనే సంస్థ తీసిన ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేశాయి. ఈ కొత్త వంతెన అందుబాటులోకి రావడం వలన ప్యాంగాగ్ నది ఉత్తర, దక్షిణ ఒడ్డులను కలిపే దూరం 50 నుంచి 100 కిలోమీటర్ల మేర తగ్గనుంది.