Share News

ఓటీపీ మోసాలకు ‘అడా్‌పఐడీ’తో చెక్‌!

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:54 AM

ఇటీవల కాలంలో ఓటీపీ మోసాలు, పాస్‌వర్డ్‌ హ్యాకింగ్‌ వంటి నేరాలు అధికమయ్యాయి. అయితే ఈ తరహా నేరాలకు చెక్‌ పెట్టే విధంగా ఐఐటీ మండి పరిశోధకులు ప్రత్యేకమైన బయోమెట్రిక్‌ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు.

ఓటీపీ మోసాలకు ‘అడా్‌పఐడీ’తో చెక్‌!

ఐఐటీ మండి పరిశోధకుల నూతన ఆవిష్కరణ

న్యూఢిల్లీ, మార్చి 26: ఇటీవల కాలంలో ఓటీపీ మోసాలు, పాస్‌వర్డ్‌ హ్యాకింగ్‌ వంటి నేరాలు అధికమయ్యాయి. అయితే ఈ తరహా నేరాలకు చెక్‌ పెట్టే విధంగా ఐఐటీ మండి పరిశోధకులు ప్రత్యేకమైన బయోమెట్రిక్‌ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. ‘అడా్‌పఐడీ’ అని పిలిచే ఈ వ్యవస్థ పాస్వ్‌ర్డ్‌లు, ఓటీపీలు అవసరం లేకుండానే సురక్షితమైన యూజర్‌ యాక్సెస్‌ ప్రక్రియను అందిస్తుంది. ఏఐ సాయంతో పనిచేసే అడా్‌పఐడీని ఐఐటీ మండీలోని సెంటర్‌ ఫర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రోబోటిక్స్‌ (సీఏఐఆర్‌)కు చెందిన అమిత్‌ శుక్లా, డీప్‌ అల్గారిథమ్స్‌కు చెందిన జేపీ మిశ్రాతో కలిసి అభివృద్ధి చేశారు. ‘అడా్‌పఐడీ’ వ్యవస్థకు ఇప్పటికే పేటెంట్‌ లభించిందని, దీన్ని ఇప్పటికే ఒక బ్యాంకు, ఫోరెన్సిక్‌ కార్యాలయాల్లో ఉపయోగించారని పరిశోధకులు తెలిపారు. ప్రభుత్వ పథకాల్లో దీని వినియోగం కోసం పరిశోధక బృందం ప్రస్తుతం ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై)తో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 08:07 AM