Share News

పెళ్లిళ్ల పేరమ్మలా చాట్‌జీపీటీ!

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:33 AM

మాయల ఫకీరు దుర్భిణి వేసి గాలిస్తే బాలనాగమ్మ దొరికింది! కానీ అది కథ. కల్పన. నిజజీవితంలో అసాధ్యం. ఈకాలంలో మనకు అన్ని విధాలా సరిపోయే సరిజోడును కనిపెట్టడం ఎలా? అందుకే ఆ పనిని కృత్రిమ మేధకు అప్పజెప్పాడో రష్యన్‌ కుర్రాడు అలెగ్జాండర్‌. వయసు 23. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన

పెళ్లిళ్ల పేరమ్మలా చాట్‌జీపీటీ!

రష్యన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వినూత్న ఆలోచన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: మాయల ఫకీరు దుర్భిణి వేసి గాలిస్తే బాలనాగమ్మ దొరికింది! కానీ అది కథ. కల్పన. నిజజీవితంలో అసాధ్యం. ఈకాలంలో మనకు అన్ని విధాలా సరిపోయే సరిజోడును కనిపెట్టడం ఎలా? అందుకే ఆ పనిని కృత్రిమ మేధకు అప్పజెప్పాడో రష్యన్‌ కుర్రాడు అలెగ్జాండర్‌. వయసు 23. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన అలెగ్జాండర్‌.. ప్రపంచానికి చాట్‌ జీపీటీ గురించి తెలియకముందే వృత్తిరీ త్యా తన వద్దకు వచ్చిన జీపీటీ3 (అప్పటికి అది చాట్‌జీపీటీ కాదు) సాఫ్ట్‌వేర్‌ను ప్రముఖ డేటింగ్‌ సైట్‌ టిండర్‌కు అనుసంధానంచేసి తనకు సరిపోయే అమ్మాయిల ప్రొఫైళ్లను జల్లెడ పట్టే బాధ్యత అప్పగించాడు! జీపీటీ3, మరికొన్ని ఏఐ బాట్స్‌నూ ఈ పని కి ఉపయోగించాడు. జీపీటీతో నిత్యం మాట్లాడుతూ తన ఇష్టాయిష్టాలు, మనస్తత్వం గురించి దానికి సరిగ్గా అర్థమయ్యేలా చేశాడు! డేటింగ్‌ సైట్లలో తన అభిరుచులకు అనుగుణంగా ఉన్న అమ్మాయిలను వెతికేందుకు కొన్ని సూచనలు ఇచ్చాడు. ఉదాహరణకు.. ప్రొఫైల్‌లో కనీసం రెండు ఫొటోలైనా ఉన్న అమ్మాయిలనే వెతకాలి. ఆ అమ్మాయి దేవుణ్ని నమ్మే వ్యక్తి అయి ఉండాలివంటి పలు సూచనలు ఇచ్చాడు. వీటి ఆధారంగా జీపీటీ, ఏఐ బాట్లు.. టిండర్‌, టీజీ అనే డేటింగ్‌ వెబ్‌సైట్లలో 5,239ప్రొఫైళ్లను జల్లెడపట్టి చివరకు 12 మందిని ఎంపిక చేశాయి. వీరితో డేటింగ్‌కి వెళ్లి.. కరీనా అనే అమ్మాయిని ఎంచుకున్నాడు అలెగ్జాండర్‌. ఈ ప్రక్రియకు ఏడాదికిపైగా సమయం పట్టింది. ప్రస్తుతం వారిద్దరికీ పెళ్లయ్యింది. కరీనాను ఎంపిక చేసుకోవడానికి తాను కృత్రిమ మేధను వాడినట్టు అలెగ్జాండర్‌ పెళ్లికి ముందే ఆమెకు చెప్పాడు.

Updated Date - Feb 06 , 2024 | 03:33 AM