Share News

ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ఆందోళనపై స్పందించిన కేంద్రం

ABN , Publish Date - Jan 03 , 2024 | 10:59 AM

ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ఆందోళనపై కేంద్రం స్పందించింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106 (2) కింద 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధింపునకు సంబంధించి ట్రక్కర్‌ల ఆందోళనలను భారత ప్రభుత్వం గుర్తించిందని తెలిపింది.

ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ఆందోళనపై స్పందించిన కేంద్రం

ఢిల్లీ: ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ఆందోళనపై కేంద్రం స్పందించింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106 (2) కింద 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధింపునకు సంబంధించి ట్రక్కర్‌ల ఆందోళనలను భారత ప్రభుత్వం గుర్తించిందని తెలిపింది. ఈ రోజు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులతో వివరణాత్మక చర్చను నిర్వహించామని తెలిపింది.

ఈ కొత్త చట్టాలు, నిబంధనలు ఇంకా అమలులోకి రాలేదని వెల్లడించింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106 (2)ను అమలు చేయాలనే నిర్ణయాన్ని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్‌తో సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకుంటామని కేంద్రం తెలిపింది. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్‌‌తో పాటు డ్రైవర్‌లందరూ విధుల్లోకి తిరిగి చేరాలని విజ్ఞప్తి చేస్తున్నామని కేంద్రం పేర్కొంది.

Updated Date - Jan 03 , 2024 | 10:59 AM