Share News

సీపీఆర్‌పై కేంద్రం కన్నెర్ర

ABN , Publish Date - Jan 18 , 2024 | 03:08 AM

ప్రముఖ స్వచ్ఛంద సంస్థ(ఎన్‌జీఓ) సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌(సీపీఆర్‌)పై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. 1973లో స్థాపించిన ఈ సంస్థ దేశంలోనే అత్యంత పురానతమైన పరిశోధనా కేంద్రం, మేధోసంపత్తికి నిలయం.

సీపీఆర్‌పై కేంద్రం కన్నెర్ర

ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ రద్దు చేసిన హోం శాఖ

న్యూఢిల్లీ, జనవరి 17: ప్రముఖ స్వచ్ఛంద సంస్థ(ఎన్‌జీఓ) సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌(సీపీఆర్‌)పై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. 1973లో స్థాపించిన ఈ సంస్థ దేశంలోనే అత్యంత పురానతమైన పరిశోధనా కేంద్రం, మేధోసంపత్తికి నిలయం. ఈ సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎ్‌ఫసీఆర్‌ఏ) లైసెన్స్‌ను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. సీపీఆర్‌ లైసెన్స్‌ వాస్తవానికి 11 నెలల క్రితమే రద్దయింది. అయితే తాజా ఉత్తర్వులు జనవరి 10న వెలువడినట్లు సమాచారం. దీనిపై సీపీఆర్‌ అధ్యక్షురాలు యామినీ అయ్యర్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘మేం చట్టం పరిధిలోనే పనిచేస్తున్నాం. ఎఫ్‌సీఆర్‌ఏ రద్దు చేయడం బాధాకరం. మా వాదనను వినడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా ఏకపక్షగా నిర్ణయం తీసుకున్నారు. న్యాయం కోసం అన్ని మార్గాలను వెతుకుతాం. మేం మా లక్ష్యాలకు కట్టుబడి ఉన్నాం. సమస్య రాజ్యాంగ విలువలకు లోబడి పరిష్కారమవుతుందన్న నమ్మకం మాకు ఉంది’ అని అన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 08:14 AM