Share News

ఆస్పత్రుల్లో భద్రతపై కేంద్రం మార్గదర్శకాలు

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:07 AM

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిమ్స్‌, ఈఎ్‌సఐ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో భద్రతను పెంచాలని నిర్ణయించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆస్పత్రి ప్రాంగణంలో వైద్య సిబ్బందిపై దాడులను నిరోధించడానికి రాష్ట్ర

ఆస్పత్రుల్లో భద్రతపై కేంద్రం మార్గదర్శకాలు

హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిమ్స్‌, ఈఎ్‌సఐ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో భద్రతను పెంచాలని నిర్ణయించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆస్పత్రి ప్రాంగణంలో వైద్య సిబ్బందిపై దాడులను నిరోధించడానికి రాష్ట్ర చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది. ‘‘ఆస్పత్రుల లోపలికి వచ్చే, బయటకు వెళ్లే మార్గాలు, కారిడార్లు సహా అన్ని ప్రదేశాల్లో హైరిజల్యూషన్‌ సీసీటీవీ కెమెరాలు అమర్చాలి. సిబ్బంది, రోగులు, సందర్శకులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అత్యవసర సమయాల్లో సమాచారాన్ని త్వరగా వ్యాప్తి చేయడానికి పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ ఉండాలి. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలి. ఆస్పత్రుల క్యాంప్‌సలో డార్క్‌స్పాట్‌లను గుర్తించాలి. మహిళా వైద్య సిబ్బంది విధులు నిర్వహించే ప్రదేశాలతో పాటు రాకపోకలు సాగించే మార్గాల్లో, పార్కింగ్‌ స్థలాల్లో తగినంత వెలుతురు ఉండేలా చూడాలి. రాత్రిపూట మహిళా వైద్య సిబ్బందిని ఒకరి కంటే ఎక్కువ మందిని నియమించాలి. వారికి సురక్షితమైన డ్యూటీ రూమ్‌లు ఏర్పాటు చేయాలి’’ అని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది.

Updated Date - Aug 21 , 2024 | 05:07 AM