Share News

జైళ్లలో కుల, మత వివక్ష చెల్లదు

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:50 AM

కులం, మతం ఆధారంగా జైళ్లలో ఖైదీల పట్ల వివక్ష చూపిస్తుండడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇలాంటివాటికి వెంటనే స్వస్తి పలకాలని తెలిపింది. ఇందుకు

జైళ్లలో కుల, మత వివక్ష చెల్లదు

నిబంధనలు సవరించండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

చెన్నై, ఫిబ్రవరి 29: కులం, మతం ఆధారంగా జైళ్లలో ఖైదీల పట్ల వివక్ష చూపిస్తుండడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇలాంటివాటికి వెంటనే స్వస్తి పలకాలని తెలిపింది. ఇందుకు వీలుకలిగించే నిబంధనలు కొన్ని రాష్ట్రాల జైళ్ల మ్యాన్యువల్‌లలో ఉన్నాయని, వాటిని తక్షణమే రద్దు చేయడమో, సవరించడమో చేయాలని ఆదేశించింది. ఖైదీలను వారి కులం, మతం ఆధారంగా వేరు చేయడంతో పాటు అందుకు అనుగుణంగా వారికి జైళ్ల పనులు అప్పగించడం కొన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. 2016నాటి మోడల్‌ ప్రిజన్‌ మాన్యువల్‌లోనూ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు గుర్తు చేసింది. వంటశాల నిర్వహణ, ఆహారం తయారీ తదితర పనుల్లో కులం, మతాన్ని చూడకూడదని; సామాజిక, ఆర్థిక హోదాల ఆధారంగా ఖైదీలను విభజించకూడదని, అందర్నీ ఒకేలా చూడాలని స్పష్టంగా ఉంది. ఈ నిబంధనలు అన్ని రాష్ట్రాల జైళ్ల మాన్యువల్‌లలో పొందుపరచాలని సూచించింది. ఖైదీల శారీరిక, మానసిక ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని తెలిపింది.

Updated Date - Mar 01 , 2024 | 07:44 AM