Share News

Delhi: వివరాలు బహిర్గతం చెయ్యలేం..

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:46 AM

ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాల్లోని వివిధ పరికరాల తయారీ, సరఫరాదారుల సమాచారాన్ని బహిర్గతం చెయ్యలేమని ఈసీఐఎల్‌, బీఈఎల్‌ సంస్థలు స్పష్టం చేశాయి. సమాచార హక్కు చట్టం కింద తమకు అందిన దరఖాస్తులకు ఈ మేరకు వేర్వేరుగా ఒకే రకమైన సమాధానం ఇచ్చాయి.

Delhi:  వివరాలు బహిర్గతం చెయ్యలేం..

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాల్లోని వివిధ పరికరాల తయారీ, సరఫరాదారుల సమాచారాన్ని బహిర్గతం చెయ్యలేమని ఈసీఐఎల్‌, బీఈఎల్‌ సంస్థలు స్పష్టం చేశాయి. సమాచార హక్కు చట్టం కింద తమకు అందిన దరఖాస్తులకు ఈ మేరకు వేర్వేరుగా ఒకే రకమైన సమాధానం ఇచ్చాయి.

వెంకటేశ్‌ నాయక్‌ అనే ఆర్‌టీఐ కార్యకర్త ఈసీఐఎల్‌, బీఈఎల్‌కు వేర్వేరుగా దరఖాస్తులు చేశారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌ యంత్రాల్లోని వివిధ పరికరాలను ఎవరు తయారు చేస్తారు? ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే వివరాలు అడిగారు. దీనికి ఈసీఐఎల్‌, బీఈఎల్‌.. ఆర్‌టీఐ సెక్షన్‌ 8(1)(డీ) కింద రహస్య వివరాలను వెల్లడించలేమని తెలిపాయి.

Updated Date - Apr 25 , 2024 | 03:46 AM