ఇందిరను మదర్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పా
ABN , Publish Date - Jun 17 , 2024 | 05:45 AM
దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘మదర్ ఆఫ్ ఇండియా’గా అభివర్ణించడం సంచలనం కావడంతో కేంద్ర మంత్రి సురేశ్ గోపి ఆదివారం వివరణ ఇచ్చారు.

వివరణ ఇచ్చిన కేంద్రమంత్రి సురేశ్ గోపి
మీడియా వక్రీకరించిందని వ్యాఖ్య
తిరువనంతపురం, జూన్ 16 : దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘మదర్ ఆఫ్ ఇండియా’గా అభివర్ణించడం సంచలనం కావడంతో కేంద్ర మంత్రి సురేశ్ గోపి ఆదివారం వివరణ ఇచ్చారు. తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇందిరను ‘మదర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ’ అన్నానని.. మీడియా దాన్ని వక్రీకరించిందని చెప్పుకొచ్చారు. ‘‘ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా.. కాంగ్రె్‌సకు సంబంధించినంత వరకు కేరళలో కె. కరుణాకరన్ తండ్రి వంటివారు.. దేశంలో ఇందిరాగాంధీ తల్లి.. ఇదే నేను అన్నాను.’’ అని ఆయన చెప్పుకొచ్చారు.