Share News

ఏడాదికి మూడుసార్లు సీఏ పరీక్షలు

ABN , Publish Date - Mar 09 , 2024 | 03:15 AM

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) సీఏ ఫౌండేషన్‌, ఇంటర్‌ పరీక్షలను ఏడాదికి మూడుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది.

ఏడాదికి మూడుసార్లు సీఏ పరీక్షలు

ఫౌండేషన్‌, ఇంటర్‌లకు అవకాశం

న్యూఢిల్లీ, మార్చి 8: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) సీఏ ఫౌండేషన్‌, ఇంటర్‌ పరీక్షలను ఏడాదికి మూడుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది. గురువారం నిర్వహించిన ఐసీఏఐ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏటా జనవరి, మే/జూన్‌, సెప్టెంబరు నెలల్లో ఈ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది నుంచే దీన్ని అమలు చేస్తారు. గతంలో ఏటా జనవరి, మే/జూన్‌ నెలల్లో మాత్రమే వీటిని నిర్వహించేవారు. విద్యార్థులకు సౌలభ్యంగా ఉండేందుకు ఏడాదికి మూడుసార్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఏఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆయా పరీక్షల మధ్య వ్యవధిని కూడా రెండు నెలలు తగ్గించినట్లు ప్రకటించింది.తద్వారా విద్యార్థులు ఎక్కువ కాలం వేచి చూడకుండా పరీక్షలు రాసే అవకాశం లభిస్తుందని వెల్లడించింది.

Updated Date - Mar 09 , 2024 | 07:22 AM