Share News

Budjet : మైనారిటీ వ్యవహారాలకు నిధుల పెంపు

ABN , Publish Date - Jul 24 , 2024 | 04:44 AM

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు ఈ ఏడాది రూ. 3,183.24 కోట్ల నిధులను కేటాయించారు.

Budjet : మైనారిటీ వ్యవహారాలకు నిధుల పెంపు

న్యూఢిల్లీ, జూలై 23: మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు ఈ ఏడాది రూ. 3,183.24 కోట్ల నిధులను కేటాయించారు. 2023- 24 బడ్జెట్‌లో ఈ శాఖకు రూ. 2,608.93 కోట్లు కేటాయించగా తాజాగా రూ. 574.31 కోట్లు పెంచారు. వీటిలో 1,575.72 కోట్లు మైనారిటీల విద్యాభివృద్ధికి, రూ.326.16 కోట్లు ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పలకు, రూ. 1,145.38 కోట్లు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పల కోసం కేటాయించారు. మొత్తంగా రూ.2,120.72 కోట్ల నిధులను మైనారిటీల కోసం ప్రతిపాదించిన ప్రధాన పథకాల, ప్రాజెక్టుల అమలు కోసం, ప్రధాన మంత్రి జనవికాస్‌ కార్యక్రమం కోసం రూ. 910.90 కోట్లను కేటాయించారు. జాతీయ మైనారిటీల అభివృద్ధి, ఆర్థిక కార్పొరేషన్‌కు రూ. 800 కోట్లను కేటాయించారు.

Updated Date - Jul 24 , 2024 | 07:17 AM