లాటరీలో బ్రిటన్ వ్యక్తికి రూ.1800 కోట్లు
ABN , Publish Date - Nov 28 , 2024 | 04:23 AM
బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి జాక్‌పాట్ కొట్టాడు. అతడు కొన్న లాటరీకి సుమారు రూ. 1800 కోట్ల(177 మిలియన్ పౌండ్లు) ప్రైజ్‌మనీ తగలడంతో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

లండన్, నవంబరు 27: బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి జాక్‌పాట్ కొట్టాడు. అతడు కొన్న లాటరీకి సుమారు రూ. 1800 కోట్ల(177 మిలియన్ పౌండ్లు) ప్రైజ్‌మనీ తగలడంతో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. మంగళవారం బ్రిటన్‌లోని నేషనల్ లాటరీని నిర్వాహకులు డ్రా తీశారు. 07, 11, 25, 31, 40 నంబరు గల టికెట్‌కు లాటరీ దక్కినట్లు ప్రకటించారు. ఇది బ్రిటన్‌లో మూడో అతిపెద్ద లాటరీ ప్రైజ్‌మనీ అని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే లాటరీ గెలుచుకున్న వ్యక్తి వివరాలను మాత్రం బయటపెట్టలేదు. కాగా, బ్రిటన్‌లో అతిపెద్ద నేషనల్ లాటరీ బహుమతిని 2022 మే 10న గ్లౌసెస్టర్‌కు చెందిన జో, జెస్ త్వైట్‌లు గెలుచుకున్నారు. దీని విలువ సుమారు 195 మిలియన్ పౌండ్లు.