స్కూల్ ఎగ్గొట్టేందుకు... బాంబు బెదిరింపు మెయిల్
ABN , Publish Date - Aug 04 , 2024 | 05:58 AM
పాఠశాలకు వెళ్లడం ఇష్టంలేని ఓ విద్యార్థి చేసిన అల్లరి పని... ఢిల్లీలోని సమ్మర్ ఫీల్డ్స్ స్కూల్ యాజమాన్యానికి ముచ్చెమటలు పట్టేలా చేసింది. పాఠశాలలో బాంబు ఉందంటూ
ఢిల్లీలో 14 ఏళ్ల విద్యార్థి నిర్వాకం
న్యూఢిల్లీ, ఆగస్టు 3: పాఠశాలకు వెళ్లడం ఇష్టంలేని ఓ విద్యార్థి చేసిన అల్లరి పని... ఢిల్లీలోని సమ్మర్ ఫీల్డ్స్ స్కూల్ యాజమాన్యానికి ముచ్చెమటలు పట్టేలా చేసింది. పాఠశాలలో బాంబు ఉందంటూ గురువారం అర్ధరాత్రి సమయంలో మెయిల్ వచ్చింది. శుక్రవారం ఉదయం మెయిల్ చూసుకున్న సిబ్బంది... అప్పటికే పాఠశాల ప్రారంభంకావడంతో, హుటాహుటిన విద్యార్థులను బయటకు తరలించారు. తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు... మెయిల్ పంపింది అదే పాఠశాలకి చెందిన 14 ఏళ్ల విద్యార్థని కనిపెట్టారు. స్కూల్ ఎగ్గొట్టడం కోసమే ఈ పనిచేశానని అతను అంగీకరించాడు. అయితే, కేవలం తమ పాఠశాల అంటే అనుమానం వస్తుందని భావించిన ఆకతాయి... తాను పంపిన మెయిల్‌లో, మరో రెండు పాఠశాలల్లో కూడా బాంబును అమర్చినట్లు పేర్కొన్నాడు. కాగా, మే 2న ఢిల్లీలోని ఏకంగా 131 పాఠశాలలకు ఇలాగే బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చార