Share News

Delhi Metro Blast: ఢిల్లీ మెట్రో రైలులో పేలుడు.. వీడియో వైరల్.. కానీ!

ABN , Publish Date - Feb 07 , 2024 | 08:31 PM

ఢిల్లీ మెట్రోలో ఓ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒక మెట్రో రైలులో పేలుడు సంభవించింది. ఇందుకు కారణాలు ఏంటో తెలీదు కానీ.. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అక్కడి నుంచి కాస్త దూరంగా పరుగులు పెట్టారు.

Delhi Metro Blast: ఢిల్లీ మెట్రో రైలులో పేలుడు.. వీడియో వైరల్.. కానీ!

ఢిల్లీ మెట్రోలో ఓ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒక మెట్రో రైలులో పేలుడు సంభవించింది. ఇందుకు కారణాలు ఏంటో తెలీదు కానీ.. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అక్కడి నుంచి కాస్త దూరంగా పరుగులు పెట్టారు. అయితే.. ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు. కొన్ని రోజుల క్రితం ఉత్తమ్ నగర్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


కొంతమంది ప్రయాణికులు ఉత్తమ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైలు కోసం వేచి ఉన్నారు. ఇంతలో ఆ స్టేషన్‌కి ఒక రైలు వచ్చింది. అయితే.. అది ఆగుతున్న క్రమంలో మెట్రో రైలుపై ఉండే ఎలక్ట్రిక్ జంక్షన్ వద్ద భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో.. కళ్లు బైర్లు కమ్మే ఫ్లాష్ కనిపించింది. ఇది సాంకేతిక లోపం వల్ల సంభవించిందా? లేక మరే ఇతర కారణమో తెలీదు కానీ.. ఈ పేలుడు సంభవించగానే, స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై అధికారులు ఇంతవరకూ స్పందించలేదు. బహుశా అప్పటికప్పుడే తగిన చర్యలు తీసుకున్నారా? లేకపోతే దీన్నొక చిన్న సంఘటనగా భావించి పక్కన పెట్టేశారా? అనేది తెలీదు. అసలు ఈ ఘటన సంభవించడానికి గల కారణాలను సైతం వెల్లడించలేదు. అయితే.. ఈ వీడియో వైరల్ అవుతున్న తరుణంలో, ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సింది నెటిజన్ల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Feb 07 , 2024 | 08:31 PM