Share News

బీజేపీ చీఫ్‌గా దళితుడు?

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:12 AM

బీజేపీ సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాత జనవరి లేదా ఫిబ్రవరి చివరి నాటికి ఆ పార్టీకి కొత్త అధ్యక్షుడు రానున్నారు. ప్రస్తుత బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా స్థానంలో దళిత వర్గానికి చెందిన యువనేతను ఎంపిక చేయవచ్చని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీ చీఫ్‌గా దళితుడు?

దక్షిణాది నుంచి యువనేతకు చాన్స్‌!

న్యూఢిల్లీ, డిసెంబరు 29: బీజేపీ సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాత జనవరి లేదా ఫిబ్రవరి చివరి నాటికి ఆ పార్టీకి కొత్త అధ్యక్షుడు రానున్నారు. ప్రస్తుత బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా స్థానంలో దళిత వర్గానికి చెందిన యువనేతను ఎంపిక చేయవచ్చని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు మూడు కారణాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఇటీవల అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా దళిత వర్గానికి చెందిన ఖర్గే ఉండటం, బీజేపీ దళితులకు వ్యతిరేకమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దళితుడికి పార్టీ పగ్గాలు అప్పగించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్టు చెబుతున్నారు. కాగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నేతను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Dec 30 , 2024 | 04:12 AM