Share News

Indore Lok sabha Result: ఒకే స్థానంలో రెండు సంచలనాలు.. అత్యధిక మెజారిటీ, నోటాకు రికార్డు ఓట్లు!

ABN , Publish Date - Jun 04 , 2024 | 06:09 PM

ఈ సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ స్థానం సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో వైదొలగడంతో అక్కడ రెండు సంచలన రికార్డులు నమోదయ్యాయి. ఆ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీ 10 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Indore Lok sabha Result: ఒకే స్థానంలో రెండు సంచలనాలు.. అత్యధిక మెజారిటీ, నోటాకు రికార్డు ఓట్లు!
NOTA creates record in Indore

ఈ సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ స్థానం సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో వైదొలగడంతో అక్కడ రెండు సంచలన రికార్డులు నమోదయ్యాయి. ఆ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీ 10 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదొక రికార్డు కాగా, నోటాకు అత్యధికంగా ఓట్లు జరిగిన స్థానంగా కూడా ఇండోర్ నిలిచింది. నోటాకు రికార్డు స్థాయిలో 2 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి.


ఇండోర్ లోక్‌సభ స్థానానికి మే 13వ తేదీన ఎన్నికలు జరిగాయి. బీజేపీ నుంచి సిటింగ్ ఎంపీగా శంకర్ లల్వానీ పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా అక్షయ్ కాంతి బరిలో నిలిచారు. అయితే చివరి నిమిషంలో ఏప్రిల్ 29వ తేదీన అక్షయ్ పోటీ నుంచి వైదొలిగి బీజేపీలో చేరిపోయారు. దీంతో అక్కడి కాంగ్రెస్ పోటీలో లేకుండా పోయింది. అక్షయ్ కొట్టిన దెబ్బకు షాకైన కాంగ్రెస్.. నోటాకు ఓట్లేయమని ప్రచారం చేసింది. దీంతో కాంగ్రెస్ మద్దతుదారులు నోటాకు ఓట్లేశారు. ఫలితంగా శంకర్ లల్వానీకి 12 లక్షల ఓట్లు దక్కగా, నోటాకు 2.1 లక్షల ఓట్లు వచ్చాయి.


రెండో స్థానంలో బహుజన్ సమాజ్‌వాద్ పార్టీ నేత సంజయ్‌కు కేవలం 51 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయన కంటే నోటాకే 1.5 లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. గతంలో బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో నోటాకు 51 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు అదే రికార్డు కాగా, తాజాగా ఇండోర్ ఫలితం ఆ రికార్డును అధిగమించింది.

Updated Date - Jun 04 , 2024 | 06:09 PM