Share News

Lok Sabha Elections: పారాచూట్‌ నాయకులకు బీజేపీ టికెట్లు.. బలం పెరుగుతుందా?

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:54 AM

పార్టీ కోసం కష్టపడ్డవారికి టికెట్లు ఇచ్చే పార్టీగా గుర్తింపు ఉన్న బీజేపీలో ప్రస్తుతం పారాచూట్ నాయకులకే ప్రాధాన్యం పెరుగుతందా.. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల పంజాబ్‌ (Punjab) లోక్‌సభకు ప్రకటించిన అభ్యర్థుల జాబితా చూసిన తర్వాత.. బీజేపీ(BJP)లో పారాచూట్ నాయకులకే టికెట్లు ఇచ్చారనే ప్రచారం బాగా జరుగుతోంది.

Lok Sabha Elections: పారాచూట్‌ నాయకులకు బీజేపీ టికెట్లు.. బలం పెరుగుతుందా?

పార్టీ కోసం కష్టపడ్డవారికి టికెట్లు ఇచ్చే పార్టీగా గుర్తింపు ఉన్న బీజేపీలో ప్రస్తుతం పారాచూట్ నాయకులకే ప్రాధాన్యం పెరుగుతందా.. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల పంజాబ్‌ (Punjab) లోక్‌సభకు ప్రకటించిన అభ్యర్థుల జాబితా చూసిన తర్వాత.. బీజేపీ(BJP)లో పారాచూట్ నాయకులకే టికెట్లు ఇచ్చారనే ప్రచారం బాగా జరుగుతోంది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత పంజాబ్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. రాష్ట్రంలోని 13 స్థానాలకు గాను 6 స్థానాలకు బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ఎక్కువమంది ఇతర పార్టీల నుంచి ఇటీవల కాలంలో పార్టీలో చేరినవాళ్లే ఉన్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వాళ్లకు కమలం పార్టీ ఎంపీ టికెట్లు కేటాయించింది.

పంజాబ్‌లో బీజేపీ ఇప్పటి వరకు ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. లూథియానా నుంచి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టు, జలంధర్‌ నుంచి సుశీల్‌ కుమార్‌ రింకూ, పాటియాలా నుంచి ప్రణీత్‌ కౌర్‌, ఫరీద్‌కోట్‌ నుంచి హన్స్‌రాజ్‌ హన్స్‌, అమృత్‌సర్‌ నుంచి తరంజిత్‌ సింగ్‌ సంధు, గురుదాస్‌పూర్‌ నుంచి దినేశ్‌ సింగ్‌ బాబులకు టికెట్లు కేటాయించింది. ఈ ఆరుగురిలో దినేష్ సింగ్ బాబు మాత్రమే బీజేపీలో సీనియర్ నాయకుడు. మిగిలిన ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పారాచూట్ అభ్యర్థులకే టికెట్లు కేటాయించారనే ప్రచారం జరుగుతోంది.

Elections 2024: ఆర్థిక మంత్రులు లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయరు.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

ఫిరాయింపుదారులకు టికెట్లు..

బీజేపీ టికెట్లు కేటాయించిన వారిలో ఎక్కువమంది ఫిరాయింపు దారులు ఉన్నారు. లూథియానా టికెట్ పొందిన రవ్‌నీత్ సింగ్ బిట్టు కాంగ్రెస్‌ను వీడి మార్చి 26న బీజేపీలో చేరారు. జలంధర్ నుంచి పోటీలో ఉన్న సుశీల్ కుమార్ రింకూ మార్చి 27న ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. గతేడాది జరిగిన జలంధర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో రింకూ విజయం సాధించారు. పాటియాలా ఎంపీగా ఉన్న ప్రణీత్ కౌర్ మార్చి ప్రారంభంలో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. ఆమె పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య. రిటైర్డ్ భారత దౌత్యవేత్త తరంజిత్ సింగ్ సంధు అమృత్‌సర్ నుంచి పోటీ చేయనున్నారు.తరంజిత్ సింగ్ సంధు గతంలో అమెరికాలో భారత రాయబారిగా పనిచేశారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆయనకు పార్టీ టికెట్ కేటాయించింది.

ఒంటరి పోరు

పంజాబ్‌లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇప్పటి వరకు శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు పెట్టుకుని బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చింది. గతంలో అకాలీదళ్ ఎన్‌డిఎలో భాగంగా ఉండేది, అయితే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అకాలీదళ్ 2020 సెప్టెంబర్‌లో ఎన్‌డిఎ నుంచి విడిపోయింది. ప్రస్తుతం బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోంది. సొంతంగా పంజాబ్‌లో బలపడేందుకు బీజేపీ ఇతర పార్టీల్లో బలమైన నాయకులను ఆకర్షిస్తోంది. దీంతో ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరి టికెట్లు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రయోగం బీజేపీకి కలిసి వస్తుందా.. లేదా అనేది జూన్4న తేలనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Sumalatha: ఇంకా టిక్కెట్ ఇవ్వలేదు.. త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తా.. సుమలత కామెంట్స్..

Updated Date - Apr 02 , 2024 | 11:54 AM