Share News

Anant Ambani Pre Wedding: అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌కి హాజరుకానున్న బిల్ గేట్స్

ABN , Publish Date - Feb 22 , 2024 | 05:55 PM

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహించిన అనంత్ అంబానీ (Anant Ambani), రాధిక మర్చంట్‌ల (Radhika Merchant) ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌కు మైక్రోసాఫ్ట్ (Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates), అతని మాజీ భార్య మెలిండా గేట్స్ (Melinda Gates) హాజరుకానున్నారు. ఆ ఇద్దరితో పాటు మెటా సీఈవో మార్క్ జుకర్గ్‌బర్గ్ (Mark Zuckerberg), ఇవాంకా ట్రంప్‌లతో (Ivanka Trump) కలుపుకొని మొత్తం 1,000 మంది అతిథులను ఈ వేడుకలకు ఆహ్వానించారని తెలిసింది.

Anant Ambani Pre Wedding: అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌కి హాజరుకానున్న బిల్ గేట్స్

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహించిన అనంత్ అంబానీ (Anant Ambani), రాధిక మర్చంట్‌ల (Radhika Merchant) ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌కు మైక్రోసాఫ్ట్ (Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates), అతని మాజీ భార్య మెలిండా గేట్స్ (Melinda Gates) హాజరుకానున్నారు. ఆ ఇద్దరితో పాటు మెటా సీఈవో మార్క్ జుకర్గ్‌బర్గ్ (Mark Zuckerberg), ఇవాంకా ట్రంప్‌లతో (Ivanka Trump) కలుపుకొని మొత్తం 1,000 మంది అతిథులను ఈ వేడుకలకు ఆహ్వానించారని తెలిసింది. ‘‘అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ ఫంక్షన్‌కు ప్రఖ్యాత గ్లోబల్ పర్సనాలిటీలను ఆహ్వానించాం. అయితే.. అతిథి జాబితాకు సంబంధించిన ఇతర సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది’’ అని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అలాగే.. భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర సెలెబ్రిటీలను కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వనున్నారు.


కాగా.. ఫిబ్రవరి 16న ‘లగన్ లఖ్వాను’ (Lagan Lakhvanu) వేడుకతో అనంత్, రాధికల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. జామ్‌నగర్‌లో అంబానీ ఫ్యామిలీకి చెందిన ఫామ్‌హౌస్‌లో ఈ ఫంక్షన్ జరిగింది. జామ్‌నగర్‌తో అంబానీ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉండటంతో.. అక్కడే ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అనంత్, రాధికల ప్రీవెడ్డింగ్ వేడుకలు మార్చి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు వారి నివాసంలో జరుగుతాయి. ఈ సమయంలోనే అతిరథ మహారథులు వేడుకలని హాజరుకానున్నారు. ఇదిలావుండగా.. అనంత్, రాధిక మర్చంట్ 2023 జనవరి 19వ తేదీన ముంబైలో గోల్ ధానా వేడుకలో నిశ్చితార్థం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

Updated Date - Feb 22 , 2024 | 05:55 PM