Share News

‘ఎస్సీ వర్గీకరణ’కు నిరసనగా నేడు భారత్‌ బంద్‌

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:19 AM

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంశంపై ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసనగా బుధవారం భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నారు. ‘ది రిజర్వేషన్‌ బచావో సంఘర్ష్‌ సమితి’ బంద్‌కు

‘ఎస్సీ వర్గీకరణ’కు నిరసనగా నేడు భారత్‌ బంద్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంశంపై ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసనగా బుధవారం భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నారు. ‘ది రిజర్వేషన్‌ బచావో సంఘర్ష్‌ సమితి’ బంద్‌కు పిలుపు ఇవ్వగా, పలు ఎస్సీ, ఎస్టీ సంఘాలు, బీఎస్పీ మద్దతు పలికాయి. భారత్‌ బంద్‌లో తమ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొనాలని బీఎస్పీ కోరింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ విధానానికి లోబడి ఉప కులాలను వర్గీకరించే హక్కును ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు కల్పిస్తూ ఈ నెల 1వ తేదీన సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కాగా, బంద్‌ నుంచి అంబులెన్స్‌లు, అత్యవసర సర్వీసులు, ఆస్పత్రులు-వైద్య సేవలు, ఫార్మసీ, పోలీసు సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు.

Updated Date - Aug 21 , 2024 | 05:20 AM