Share News

*401# కాల్స్‌తో జాగ్రత్త!

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:40 AM

హలో.. నమస్తే సార్‌/మేడమ్‌.. మేము మీ టెలికామ్‌ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. మా సేవలను మీరు ఆనందిస్తున్నారా..? నెట్‌వర్క్‌ సమస్యలు ఏమైనా ఉన్నాయా..?

*401#  కాల్స్‌తో జాగ్రత్త!

మీ కాల్స్‌ ఇంకొకరికి వెళ్లిపోతాయి

సైబర్‌ నేరగాళ్ల కాల్‌ఫార్వార్డింగ్‌ మోసం

ప్రజలకు టెలికామ్‌ శాఖ హెచ్చరిక

న్యూఢిల్లీ, జనవరి 11: ‘హలో.. నమస్తే సార్‌/మేడమ్‌.. మేము మీ టెలికామ్‌ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. మా సేవలను మీరు ఆనందిస్తున్నారా..? నెట్‌వర్క్‌ సమస్యలు ఏమైనా ఉన్నాయా..? ఉంటే.. మీ మొబైల్‌లో ూ401ు తర్వాత మేము సూచించిన మొబైల్‌ నెంబర్‌ టైప్‌ చేసి డయల్‌ చెయ్యండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది’’ అని ఎవరైనా ఫోన్‌ చేసి మీకు చెబితే... తొందరపడకండి.. అలా చెయ్యమని ఏ టెలికామ్‌ సంస్థ మి మ్మల్ని కోరదు. సైబర్‌ నేరగాళ్ల నయా మోసం ఇది. ఒక వేళ అపరిచిత వ్యక్తి చెప్పినట్టుగా ూ401ు తర్వాత గుర్తు తెలియని నంబర్‌ టైప్‌ చేసి డయల్‌ చేస్తే అంతే సంగతి. మీ సిమ్‌కు రావాల్సిన ఫోన్‌ కాల్స్‌ ఆ గుర్తు తెలియని నంబర్‌కు వెళ్లేందుకు అవసరమైన కాల్‌ ఫార్వార్డ్‌కు మీకు తెలియకుండా మీరు అనుమతించినట్టే. ఇక, ఆ కాల్స్‌ను రిసీవ్‌ చేసుకున్న వాళ్లు వాటితో సులువుగా మోసాలకు పాల్పడతారు. మీరు బుక్కైపోతారు జాగ్రత్త.. ఈ ూ401ు మోసం పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టెలికామ్‌ శాఖ గురువారం ఓ హెచ్చరిక జారీ చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. వినియోగదారులు తమ ఫోన్‌ సెట్టింగ్స్‌లో కాల్‌ ఫార్వార్డింగ్‌ ఆప్షన్‌ ఇనేబుల్‌లో ఉంటే వెంటనే డిసేబుల్‌ చేసుకోవాలని సూచించింది.

Updated Date - Jan 12 , 2024 | 06:45 AM