Share News

Ayodhya Rama : బీజేపీకి దక్కని అయోధ్య రాముని ఆశీస్సులు

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:43 AM

అయోధ్య రామ మందిరం.. బీజేపీ ఎన్నికల ప్రచార అస్త్రాల్లో అత్యంత ప్రధానమైనది. ఇదే మూడోసారి అధికార పీఠాన్ని దక్కిస్తుందని ఆ పార్టీ ప్రగాఢంగా విశ్వసించింది. కాంగ్రెస్‌, ఎస్పీలను గెలిపిస్తే ఆ పార్టీలు రామమందిరంపైకి బుల్డోజర్లను నడిపిస్తాయంటూ మే 17న సాక్షాత్తూ ప్రధాని మోదీ

Ayodhya Rama : బీజేపీకి దక్కని అయోధ్య రాముని ఆశీస్సులు

ఫైజాబాద్‌లో ఎస్పీ అభ్యర్థి అవధేశ్‌ ప్రసాద్‌ గెలుపు

న్యూఢిల్లీ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): అయోధ్య రామ మందిరం.. బీజేపీ ఎన్నికల ప్రచార అస్త్రాల్లో అత్యంత ప్రధానమైనది. ఇదే మూడోసారి అధికార పీఠాన్ని దక్కిస్తుందని ఆ పార్టీ ప్రగాఢంగా విశ్వసించింది. కాంగ్రెస్‌, ఎస్పీలను గెలిపిస్తే ఆ పార్టీలు రామమందిరంపైకి బుల్డోజర్లను నడిపిస్తాయంటూ మే 17న సాక్షాత్తూ ప్రధాని మోదీ ఆరోపణలు చేశారు. అయినా ఆ మాటలను.. రామమందిరం కొలువై ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గ ప్రజలు విశ్వసించలేదు. ఆ బాల రాముడి ఆశీస్సులు సైతం బీజేపీకి దక్కలేదు. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి లల్లు సింగ్‌పై.. సమాజ్‌వాదీ అభ్యర్థి అవధేశ్‌ ప్రసాద్‌ ఘన విజయం సాధించారు. అయోధ్యనుఅభివృద్ధి చేసే క్రమంలో భాగంగా రోడ్ల వెడల్పు కార్యక్రమంలో 4000 దుకాణాలను కూల్చివేయడం, చాలామందికి పునరావాస ప్యాకేజీలు ఇవ్వకపోవడం.. ఈ ఓటమికి కారణాలని సమాచారం.

మోదీకి ముచ్చెమటలు..

వారాణసీలో వెలువడ్డ తొలి రెండు రౌండ్ల ఫలితాలు మోదీ పరివారానికి ముచ్చెమటలు పట్టించాయి. ఆ రౌండ్లలో మోదీకి 9,500ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి అజయ్‌రాయ్‌కి 14,503ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ మోదీ ముందంజలోకి రావడంతో వారంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 2019లో మోదీకి 4,79,505 మెజారిటీ రాగా, ఈసారి 1,52,513 మెజారిటీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Updated Date - Jun 05 , 2024 | 05:43 AM