Share News

Ayodhya: విదేశాల్లో ‘అయోధ్య’ ప్రత్యక్ష ప్రసారాలు

ABN , Publish Date - Jan 14 , 2024 | 09:54 AM

అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరపనున్న నేపథ్యంలో అమెరికాలోని పదికిపైగా రాష్ట్రాలలో రామమందిరానికి సంబంధించిన భారీ బిల్‌బోర్డులను 40కిపైగా ఏర్పాటు చేస్తున్నట్టు వీహెచ్‌పీ-అమెరికా ప్రధానకార్యదర్శి అమితాబ్‌ వీడబ్ల్యూ మిత్తల్‌ తెలిపారు. ఇప్పటికే టెక్సాస్‌, ఇల్లినాయిస్‌, న్యూయార్క్‌, న్యూజెర్సీ, జార్జియా రాష్ట్రాలలో ఈ బోర్డులను ఏర్పా టు చేసినట్టు చెప్పారు.

Ayodhya: విదేశాల్లో ‘అయోధ్య’ ప్రత్యక్ష ప్రసారాలు

- అమెరికాలోని 10 రాష్ట్రాల్లో భారీ బిల్‌బోర్డుల ఏర్పాటు

- ఆఫ్రికాలోని మారిష్‌సలో 10 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు

వాషింగ్టన్‌, పోర్ట్‌లూయిస్‌, జనవరి 13: అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరపనున్న నేపథ్యంలో అమెరికాలోని పదికిపైగా రాష్ట్రాలలో రామమందిరానికి సంబంధించిన భారీ బిల్‌బోర్డులను 40కిపైగా ఏర్పాటు చేస్తున్నట్టు వీహెచ్‌పీ-అమెరికా ప్రధానకార్యదర్శి అమితాబ్‌ వీడబ్ల్యూ మిత్తల్‌ తెలిపారు. ఇప్పటికే టెక్సాస్‌, ఇల్లినాయిస్‌, న్యూయార్క్‌, న్యూజెర్సీ, జార్జియా రాష్ట్రాలలో ఈ బోర్డులను ఏర్పా టు చేసినట్టు చెప్పారు. అరిజోనా, మిస్సోరీ రాష్ట్రాలలో ఈనెల 15వ తేదీన రామమందిర బిల్‌బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే అమెరికాలోని హిందువులు భారీ కారు ర్యాలీలు నిర్వహించారు. అలాగే, ఆఫ్రికా ఖండంలోని మారిషస్‌ దేశంలో హిందువులైన ఉద్యోగులు ఈనెల 22న పూజల్లో పాల్గొనేందుకు రెండు గంటలు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు ఆ దేశ కేబినెట్‌ శుక్రవారం ఆమోదం తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మారిషస్‌ జనాభాలో హిందువులు దాదాపు 48.5 శాతం ఉన్నారు. కాగా, ఆ దేశ జనాభాలో 68ువరకు భారత సంతతికి చెందినవారే. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో వచ్చే 10 రోజులు మారిష్‌సలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు మారిషస్‌ సనాతన ధర్మ టెంపుల్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఘూర్బిన్‌ భోజ్‌రాజ్‌ తెలిపారు. వీధుల్లో ర్యాలీలు, చారిత్రక, ముఖ్యమైన భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించడంతోపాటు ముఖ్యమైన కూడళ్లలో ఎల్‌సీడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేసి మందిర ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు చెప్పారు. ఈనెల 22న అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ రామాలయ ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు మారిషస్‌ సీనియర్‌ మంత్రి అంజివ్‌ రామ్‌ధన్య చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రమిదలు కూడా వెలిగించనున్నట్టు తెలిపారు.

Updated Date - Jan 14 , 2024 | 09:55 AM