అసోంలో టీచర్‌ను పొడిచి చంపిన విద్యార్థి
ABN , Publish Date - Jul 08 , 2024 | 04:58 AM
అసోంలో 11వ త రగతి చదువుతున్న ఓ విద్యార్థి తరగతి గదిలోనే ఉపాధ్యాయుడిని పొడిచి చంపేశాడు. ఈ ఘటన శివసాగర్ జిల్లాలో శనివారం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశ్ బారువా బెజవాడ(55) శివసాగర్ పట్టణంలో ఓ కోచింగ్ సెంటర్‌లో రసాయన శాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సరిగ్గా చదవడం లేదని ఓ విద్యార్థిని శుక్రవారం

గువాహటి, జూలై 7: అసోంలో 11వ త రగతి చదువుతున్న ఓ విద్యార్థి తరగతి గదిలోనే ఉపాధ్యాయుడిని పొడిచి చంపేశాడు. ఈ ఘటన శివసాగర్ జిల్లాలో శనివారం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశ్ బారువా బెజవాడ(55) శివసాగర్ పట్టణంలో ఓ కోచింగ్ సెంటర్‌లో రసాయన శాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సరిగ్గా చదవడం లేదని ఓ విద్యార్థిని శుక్రవారం ఆయన మందలించారు. శనివారం ఆ విద్యార్థి కోచింగ్ సెంటర్‌కు సివిల్ డ్రెస్‌లో వచ్చాడు. సాయంత్రం క్లాస్ చెప్పేందుకు వచ్చిన రాజేశ్.. సివిల్ డ్రెస్‌లో వచ్చినందుకు ఆ విద్యార్థిని మరోసారి మందలించాడు. దాంతో ఆ విద్యార్థి ఒక్కసారిగా కత్తితో ఉపాధ్యాయుడిపై దాడి చేశాడు. పలుమార్లు పొడవడంతో రాజేశ్ తీవ్రరక్తస్రావమై పడిపోయాడు. రాజేశ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. పోలీసులు మైనర్ అయిన ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.