కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:07 AM
కోచింగ్ కేంద్రాలకు నిలయమైన రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

కోటా, జూలై 4: కోచింగ్ కేంద్రాలకు నిలయమైన రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జేఈఈకి శిక్షణ తీసుకుంటున్న బిహార్‌లోని నలందా జిల్లాకు చెందిన సందీప్ కుమార్ కుర్మి బుధవారం అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. గత రెండేళ్లుగా ఇక్కడి మహావీర్ నగర్‌లోని పేయింగ్ గెస్ట్ (పీజీ) రూంలో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదు. కోటాలో జనవరి నుంచి ఇంతవరకు 13 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. 13 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. గత ఏడాది లెక్కలను కూడా కలుపుకొంటే మొత్తం 26 మంది ఆత్మహత్య చేసుకున్నారు.