కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Jun 17 , 2024 | 05:49 AM
రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బిహార్‌లోని మోతీహరి ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల ఆయుశ్ జైస్వాల్.. స్థానిక సామ్రాట్ చౌక్‌లో అద్దెకుంటూ ఐఐటీ-

జైపూర్, జూన్ 16: రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బిహార్‌లోని మోతీహరి ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల ఆయుశ్ జైస్వాల్.. స్థానిక సామ్రాట్ చౌక్‌లో అద్దెకుంటూ ఐఐటీ- జేఈఈ శిక్షణ తీసుకుంటున్నాడు. శనివారం రాత్రి దాకా గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి స్నేహితులు వెళ్లి చూడగా.. ఆయుశ్ తన గదిలో ఉరివేసుకొని కనిపించాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే అతను మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. ఎడ్యుకేషన్ హబ్‌గా పేరుగాంచిన కోటాలో ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 11కు చేరింది.