Share News

Karnataka: నదిలో అద్భుతం.. బయటపడ్డ రామ్‌లల్లా రూపంలోని శ్రీ కృష్ణుడి దశావతారం విగ్రహం

ABN , Publish Date - Feb 07 , 2024 | 02:08 PM

కర్ణాటకలో(Karnataka)ని ఓ నదిలో దేవతామూర్తుల విగ్రహాలు బయటపడటం.. అవి కూడా ప్రముఖ దేవాలయంలో ప్రతిష్ఠించిన విగ్రహం రూపంలో ఉండటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Karnataka: నదిలో అద్భుతం.. బయటపడ్డ రామ్‌లల్లా రూపంలోని శ్రీ కృష్ణుడి దశావతారం విగ్రహం

బెంగళూరు: కర్ణాటకలో(Karnataka)ని ఓ నదిలో దేవతామూర్తుల విగ్రహాలు బయటపడటం.. అవి కూడా ప్రముఖ దేవాలయంలో ప్రతిష్ఠించిన విగ్రహం రూపంలో ఉండటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పురావస్తు శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయచూర్(Raichur) జిల్లాలో పారుతున్న కృష్ణ నదిలో విగ్రహాలు ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.

దీంతో అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు.. నదిలో ఉన్న విగ్రహాలను వెలికితీశారు. దేవసుగూర్ గ్రామ సమీపంలో నదిపై వంతెన నిర్మాణ పనులు జరుగుతుండగా ఇవి బయటపడినట్లు వారు తెలిపారు.


శ్రీ కృష్ణుడి దశావతరం, శివలింగాలు ఇందులో ఉన్నాయి. కృష్ణుడి విగ్రహం అయోధ్య రామ్‌లల్లా విగ్రహాన్ని పోలి ఉండటంతో భక్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.

"ఈ విగ్రహం విలక్ష లక్షణాలను కలిగి ఉంది. ఒక పీఠంపై చెక్కి ఉంది. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలతో శ్రీ కృష్ణుడి దశావతారం కనిపిస్తోంది" అని పురావస్తు శాస్త్ర లెక్చరర్ డాక్టర్ పద్మజా దేశాయ్ అన్నారు. నదిలో బయటపడిన విగ్రహాలను చూడటానికి స్థానికులు తరలి వస్తున్నారు.

lord.jpg

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 07 , 2024 | 02:17 PM