Share News

గన్‌పౌడర్‌ ఫ్యాక్టరీలో పేలుడు 8 మంది మృతి

ABN , Publish Date - May 26 , 2024 | 06:00 AM

ఛత్తీ్‌సగఢ్‌లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. బెమెతేరా జిల్లాలో ఓ ఫ్యాక్టరీలో గన్‌పౌడర్‌ పేలి 8 మంది కార్మికులు చనిపోయారు. 15 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఇళ్ల

గన్‌పౌడర్‌ ఫ్యాక్టరీలో పేలుడు 8 మంది మృతి

15 మందికి గాయాలు.. ఛత్తీ్‌సగఢ్‌లో ఘటన

పేలుడు తీవ్రతకు కూలిన ఫ్యాక్టరీ పైకప్పు’

చర్ల, మే 25: ఛత్తీ్‌సగఢ్‌లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. బెమెతేరా జిల్లాలో ఓ ఫ్యాక్టరీలో గన్‌పౌడర్‌ పేలి 8 మంది కార్మికులు చనిపోయారు. 15 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. బెమెతేరా జిల్లా బొర్సి గ్రామంలో గన్‌పౌడర్‌ తయారీ (స్పెషల్‌ బ్లాస్ట్‌ లిమిటెడ్‌ ఎక్స్‌ప్లోజివ్‌) పరిశ్రమ ఉంది. అందులో సుమారు 50-70 మంది పని చేస్తున్నారు. శనివారం ఉదయం వీరంతా విధుల్లో ఉండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీ పైకప్పు మొత్తం కూలి కార్మికులపై పడింది. దీంతో8 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను రాయ్‌పూర్‌కు తరలించారు. పేలుడుకు కారణాలను అధికారులు వెల్లడించలేదు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని సీఎం విష్ణుదేవ్‌ సాయి తెలిపారు.

Updated Date - May 26 , 2024 | 06:00 AM