Share News

మాలవీయ హనీట్రాప్‌లో పడతారనే: శంతను

ABN , Publish Date - Jun 12 , 2024 | 04:16 AM

బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ హనీట్రా్‌పలో పడొచ్చన్న భయంతోనే ఆయన స్త్రీ లోలత్వం గురించి హెచ్చరించాను తప్ప, ఆయన ప్రతిష్ఠను దిగజార్చడానికి కాదని పశ్చిమబెంగాల్‌కు చెందిన లాయర్‌

మాలవీయ హనీట్రాప్‌లో పడతారనే: శంతను

న్యూఢిల్లీ, జూన్‌ 11: బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ హనీట్రా్‌పలో పడొచ్చన్న భయంతోనే ఆయన స్త్రీ లోలత్వం గురించి హెచ్చరించాను తప్ప, ఆయన ప్రతిష్ఠను దిగజార్చడానికి కాదని పశ్చిమబెంగాల్‌కు చెందిన లాయర్‌ శంతను సిన్హా మంగళవారం వివరణ ఇచ్చారు. మాలవీయపై తాను ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టును వాడుకుంటూ కాంగ్రెస్‌ పార్టీ ‘విద్వేష ప్రచారం’ చేస్తోందన్నారు. ఈ మేరకు మంగళవారం శంతను ఫేస్‌బుక్‌లో మరో పోస్టు చేశారు. అయితే, మాలవీయ గురించి గతంలో తాను చేసిన పోస్టును డిలీట్‌ చేయబోనని ఆయన చెప్పారు. ‘‘నేను మాలవీయను లక్ష్యంగా చేసుకోలేదు. లైంగిక వేధింపుల ఆరోపణలు చేయలేదు. ఆయన హనీట్రా్‌పలో పడతారన్న భయంతోనే ఫేస్‌బుక్‌లో గతంలో ఆ పోస్టు పెట్టాను. నా పోస్టును దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు’’ అని శంతను బీజేపీ శ్రేణులను విజ్ఞప్తి చేశారు. మాలవీయ పశ్చిమ బెంగాల్‌కు వచ్చినప్పుడల్లా స్థానిక బీజేపీ నేతలు ఆయనకు అమ్మాయిలను సరఫరా చేసేవారని, మాలవీయ తన శృంగార కార్యకలాపాల కోసం బీజేపీ ఆఫీసులను కూడా వాడుకున్నారని శంతను సిన్హా ఇటీవల ఆరోపించారు.

Updated Date - Jun 12 , 2024 | 04:16 AM