Share News

వీల్‌చైర్‌ లేక వృద్ధుడి మృతి ఘటనలో ఎయిర్‌ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:49 AM

ఇటీవల ముంబై విమానాశ్రయంలో వీల్‌చైర్‌ అందుబాటులో లేకపోవడంతో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటనకు సంబంధించి డైరెక్టర్‌

వీల్‌చైర్‌ లేక వృద్ధుడి మృతి ఘటనలో ఎయిర్‌ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: ఇటీవల ముంబై విమానాశ్రయంలో వీల్‌చైర్‌ అందుబాటులో లేకపోవడంతో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటనకు సంబంధించి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. వృద్ధుడికి వీల్‌చైర్‌ సమకూర్చడంలో విఫలమైనందుకు ఎయిర్‌ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించినట్లు డీజీసీఏ గురువారం తెలిపింది. ఈనెల 12న ఓ 80 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి ఎయిర్‌ఇండియా విమానంలో న్యూయార్క్‌ నుంచి ముంబైకు వచ్చారు. విమానం దిగిన తర్వాత వీల్‌చైర్‌ అందుబాటులో లేకపోవడంతో ఆయన టెర్మినల్‌ వరకు నడుచుకుంటూ వెళ్లి గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే. విమానాశ్రయాల్లో ప్రయాణికులకు సరిపడా వీల్‌చైర్‌లు అందుబాటులో ఉండేలా చూడాలని అన్ని విమానయాన సంస్థలకు డీజీసీఏ గురువారం అడ్వైజరీ జారీ చేసింది.

Updated Date - Mar 01 , 2024 | 07:39 AM