వక్ఫ్ ఆస్తులు పెరిగితే దేశానికి ముప్పు
ABN , Publish Date - Nov 13 , 2024 | 05:56 AM
వక్ఫ్ ఆస్తులు గడిచిన పదేళ్లలో 30 శాతం పెరిగాయని, ఇదే తరహాలో కొనసాగితే దేశ వ్యతిరేక శక్తులు కుమ్మక్కవుతాయని, దేశానికి పెనుప్రమాదం తలెత్తవచ్చని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి అన్నారు. దావణగెరెలో మంత్రి మంగళవారం

బెంగళూరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): వక్ఫ్ ఆస్తులు గడిచిన పదేళ్లలో 30 శాతం పెరిగాయని, ఇదే తరహాలో కొనసాగితే దేశ వ్యతిరేక శక్తులు కుమ్మక్కవుతాయని, దేశానికి పెనుప్రమాదం తలెత్తవచ్చని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి అన్నారు. దావణగెరెలో మంత్రి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, వక్ఫ్ ఆస్తులను ముస్లిం సమాజం వినియోగం కోసం కేటాయిస్తారని అన్నారు. అక్కడ ఎటువంటి వ్యవహారాలు జరుగుతాయనేది విడమరచి చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కల్పించినందుకు కశ్మీర్ ఉగ్రవాదుల కేంద్రంగా మారలేదా అని ప్రశ్నించారు.