Share News

రాష్ట్రపతి ముర్ము పట్ల ఏకవచనంతో సంభోదన

ABN , Publish Date - Jan 30 , 2024 | 02:50 AM

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఏకవచనంతో సంబోధించిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆమెకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. చిత్రదుర్గలో అణగారినవర్గాల చైతన్య సదస్సును ఆదివారం

రాష్ట్రపతి ముర్ము పట్ల ఏకవచనంతో సంభోదన

క్షమాపణలు చెప్పిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య

బెంగళూరు, జనవరి 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఏకవచనంతో సంబోధించిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆమెకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. చిత్రదుర్గలో అణగారినవర్గాల చైతన్య సదస్సును ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం ప్రసంగిస్తూ... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అణగారినవర్గాలకు చెందినందుకే కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం, అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలకు బీజేపీ ఆహ్వానించలేదని మండిపడ్డారు. ఈ సందర్భంలోనే రాష్ట్రపతి పేరును ప్రస్తావిస్తూ ఏకవచనంతో మాట్లాడారు. ఇది వైరల్‌ అయింది. సిద్దరామయ్యను సీఎం పదవి నుంచి తొలగించాలని మాజీ సీఎం కుమారస్వామి డిమాండ్‌ చేశారు. వివాదం రాజుకోవడంతో సిద్దరామయ్య సోమవారం క్షమాపణలు చెప్పారు.

Updated Date - Jan 30 , 2024 | 07:53 AM