Share News

రూ.300 నగ 6 కోట్లకు!

ABN , Publish Date - Jun 12 , 2024 | 04:20 AM

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ నగల వ్యాపారి అమెరికన్‌ మహిళకు రూ. 300 నకిలీ నగను ఏకంగా రూ.6 కోట్లకు అమ్మి మోసం చేశాడు. ఆ మహిళ జైపూర్‌లోని జోరి బజార్‌లో కొన్ని నెలల క్రితం ఆ నగను కొన్నారు. నగల దుకాణం

రూ.300 నగ 6 కోట్లకు!

అమెరికన్‌ మహిళని మోసం చేసిన జైపూర్‌ వ్యాపారి..పోలీసుల విచారణ

జైపూర్‌, జూన్‌ 11 : రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ నగల వ్యాపారి అమెరికన్‌ మహిళకు రూ. 300 నకిలీ నగను ఏకంగా రూ.6 కోట్లకు అమ్మి మోసం చేశాడు. ఆ మహిళ జైపూర్‌లోని జోరి బజార్‌లో కొన్ని నెలల క్రితం ఆ నగను కొన్నారు. నగల దుకాణం యజమాని రాజేంద్ర సోని, అతడి కుమారుడు గౌరవ్‌ దానినాణ్యతను నిర్ధారిస్తూ ఓ నకిలీ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చారు. ఆమె ఆ నగను అమెరికా తీసుకువెళ్లి అక్కడ ఓ ఎగ్జిబిషన్‌లో ఉంచబోగా అది నకిలీదని వెల్లడైంది. దీంతో ఆ మహిళ తిరిగి భారత్‌ కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ నగల షాపు యజమానే ఆమెపై తప్పుడు కేసు పెట్టాడు. చివరికి అమెరికన్‌ ఎంబసీ జోక్యంతో జైపూర్‌ పోలీసులు ఈ ఉదంతంపై విచారణ చేపట్టారు. నిందితులు పరారీ లో ఉన్నారు. నకిలీ సర్టిఫికెట్‌ ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు జైపూర్‌లో రూ.3 కోట్ల ఫ్లాట్‌ కొన్నట్లు గుర్తించారు.

Updated Date - Jun 12 , 2024 | 04:20 AM