Share News

బ్రైటెస్ట్‌ స్టూడెంట్స్‌లో భారత సంతతి బాలిక

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:58 AM

భారత సంతతికి చెందిన తొమిదేళ్ల బాలిక ప్రపంచ గుర్తింపు సాధించింది. వరల్డ్‌ బ్రైటెస్ట్‌ స్టూడెంట్స్‌ జాబితాలో స్థానం సంపాదించింది.

బ్రైటెస్ట్‌ స్టూడెంట్స్‌లో భారత సంతతి బాలిక

వాషింగ్టన్‌, జనవరి 16: భారత సంతతికి చెందిన తొమిదేళ్ల బాలిక ప్రపంచ గుర్తింపు సాధించింది. వరల్డ్‌ బ్రైటెస్ట్‌ స్టూడెంట్స్‌ జాబితాలో స్థానం సంపాదించింది. ఇండో- అమెరికన్‌ ప్రీషా చక్రవర్తి(9) ఈ ఘనత సాధించింది. ప్రపంచంలో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించేందుకు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక జాన్స్‌ హాప్‌కిన్స్‌ సెంటర్‌ ఫర్‌ టాలెంటెడ్‌ యూత్‌(జేహెచ్‌-సీటీవై) ప్రతి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తోంది. గతేడాది నిర్వహించిన ఈ పరీక్షల్లో ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల నుంచి 16,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. కాలిఫోర్నియాలో గ్రేడ్‌ 3 చదువుతున్న ప్రీషా చక్రవర్తి ఈ పరీక్షల్లో అసాఽధారణ ప్రతిభ కనబరిచి వరల్డ్‌ స్టూడెంట్స్‌ జాబితాలో చోటు సంపాదించింది. కాగా, వరుసగా గత రెండుసార్లు ఇండో- అమెరికన్‌ బాలిక నటాషా పెరియనాయగమ్‌.. వరల్డ్‌ బ్రైటెస్ట్‌ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది.

Updated Date - Jan 17 , 2024 | 03:58 AM